కర్నూలు: నగరాభివృద్ధికి సహకరించాలి: కమిషనర్

1068చూసినవారు
కర్నూలు: నగరాభివృద్ధికి సహకరించాలి: కమిషనర్
కర్నూలు నగర పరిధిలో దామోదరం సంజీవయ్య కూడలి నుండి కెవిఆర్ గార్డెన్స్ వరకు చేపట్టనున్న 340-సి రహదారి విస్తరణలో ప్రభావితమయ్యే ఆస్తి యజమానులు నగరాభివృద్ధికి స్వచ్ఛందంగా సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ కోరారు. గురువారం చెక్‌పోస్ట్ సమీపంలోని సంతోషి ఫంక్షన్ హాల్లో ఎన్‌హెచ్-340 రహదారిలో ప్రభావిత ఆస్తి యజమానులతో సమావేశం నిర్వహించారు. నగర భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారి విస్తరణ అత్యంత కీలకమని, పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్