కర్నూలు: ఎస్సీల సంక్షేమమే లక్ష్యం: ఎస్సీ కమిషన్

309చూసినవారు
కర్నూలు: ఎస్సీల సంక్షేమమే లక్ష్యం: ఎస్సీ కమిషన్
ఎస్సీల సంక్షేమమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల బిక్షం పేర్కొన్నారు. శనివారం కర్నూలు పర్యటనలో భాగంగా ఆయన స్థానిక రాష్ట్ర అతిథి గృహానికి విచ్చేసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఎస్సీ వర్గాలకు సంబంధించిన భూసంబంధిత సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, విద్య, ఉపాధి వంటి అంశాలపై ప్రజలు తమ సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మేకల బిక్షం హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్