కర్నూలు: మహిళలూ బంగారం నగలతో ప్రయాణాలు చేస్తున్నారా జాగ్రత్త

466చూసినవారు
కర్నూలు: మహిళలూ బంగారం నగలతో ప్రయాణాలు చేస్తున్నారా జాగ్రత్త
మహిళలు బంగారం ఆభరణాలు ధరించి ప్రయాణాలు చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు హడావుడిలో సీట్లు ఎక్కేప్పుడు జాగ్రత్త వహించాలని, చుట్టుపక్కల వారిని గమనించాలని సూచించారు. తెలియని వ్యక్తుల తినుబండారాలు, పరిచయాలను నమ్మవద్దని, ఆభరణాలను స్కార్ఫ్‌తో కప్పి ఉంచాలని, అనుమానితులపై పోలీసులకు 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సూచనలు మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇవ్వబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్