కర్నూలు: రాయలసీమ జల హక్కులకై ఫిబ్రవరి 5న వైసీపీ దీక్ష

335చూసినవారు
రాయలసీమకు నీటి హక్కులు దక్కాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ, ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు వద్ద జల పోరాట దీక్షకు పిలుపునిచ్చింది. కర్నూలు జిల్లా వైయస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ అన్యాయ విధానాలకు నిరసనగా ఈ దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ గొంతుకగా ఈ ఉద్యమం కొనసాగుతుందని, నీటి వాటాపై స్పష్టత వచ్చేవరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజలను పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్