ఆలూరు జూనియర్ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో
టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది యువత నమోదు చేసుకోగా, వారిలో 30 మంది వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన యువతకు ఆమె ఆఫర్ లెటర్లు అందజేశారు. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం కొనసాగిస్తామని వైకుంఠం జ్యోతి తెలిపారు.