కర్నూలు నగర పచ్చదనంపై మంత్రి టీజీ భరత్ దృష్టి

188చూసినవారు
కర్నూలు నగర పచ్చదనంపై మంత్రి టీజీ భరత్ దృష్టి
కర్నూలు నగర ప్రజల మానసిక ఉల్లాసం, ఆహ్లాదకర వాతావరణం కోసం ఉద్యానవనాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం వీనస్ కాలనీ పార్కులో రూ. 45 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పార్కులను అన్ని వర్గాలు వినియోగించేలా మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రజాధనంతో జరిగే పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌ఆర్‌యస్, బిపియస్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్