వ్యర్థాల సమర్థ నిర్వహణతో ప్రజారోగ్య పరిరక్షణ: కమిషనర్

1034చూసినవారు
వ్యర్థాల సమర్థ నిర్వహణతో ప్రజారోగ్య పరిరక్షణ: కమిషనర్
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ, ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో అమలు చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు. శనివారం స్వచ్ఛాంధ్ర మిషన్‌లో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల సానిటరీ సూపర్వైజర్లు, ఇన్‌స్పెక్టర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తడి, పొడి వ్యర్థాలను మూలం వద్దే వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా పరిశుభ్రమైన నగరాల నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్