ఆదోని టిట్కో గృహాల్లో కొండచిలువ కలకలం

3453చూసినవారు
ఆదోనిలోని టిట్కో గృహాల్లో శనివారం రాత్రి సుమారు 4 అడుగుల పొడవున్న కొండచిలువను స్థానికులు చంపివేశారు. గతంలోనూ పలుమార్లు పాము కాటుకు గురైన స్థానికులు, పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలే దీనికి కారణమని తెలిపారు. మునిసిపాలిటీ అధికారులు, ఎమ్మెల్యే పార్థసారధికి వివరించినా ఫలితం లేదని, ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్