కేసీ కాలువలో ఏడో తరగతి విద్యార్థి గల్లంతు

7చూసినవారు
కేసీ కాలువలో ఏడో తరగతి విద్యార్థి గల్లంతు
కర్నూలు నగరంలో కేసీ కాలువలో ఈతకు వెళ్లి 12 ఏళ్ల ఏడో తరగతి విద్యార్థి అభివర్ధన్ గల్లంతయ్యాడు. లక్ష్మీదేవి, రత్నం దంపతుల కుమారుడైన అభివర్ధన్, స్నేహితులతో కలిసి వినాయక ఘాట్ వద్ద కాలువలో ఈతకు వెళ్లగా, గుర్రపు డెక్క కారణంగా నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మూడో పట్టణ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్