నగరంలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ కర్నూలు నగర కమిటీ విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేయడానికి ప్రయత్నించింది. డిప్యూటీ డీఈవో అందుబాటులో లేకపోవడం, అడిషనల్ డైరెక్టర్ వినతిపత్రం స్వీకరించకుండా వెళ్లిపోవడంతో నిరసనగా కాళీ కుర్చీకి వినతిపత్రం సమర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ఆర్య, కార్యదర్శి అంజి మాట్లాడుతూ శ్రీ చైతన్య, నారాయణ, కేశవరెడ్డి, భాష్యం పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు, అడ్మిషన్ ఫీజులు, యాప్‌ల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.