సార్వత్రిక సమ్మెకు ఆటో కార్మికుల మద్దతు

203చూసినవారు
సార్వత్రిక సమ్మెకు ఆటో కార్మికుల మద్దతు
కర్నూలు పట్టణంలో 12వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెకు ఆటో కార్మికులు మద్దతు ప్రకటించారు. స్థానిక కార్మిక కర్షక భవనంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిఐటియు, ఏఐటియుసి ఆటో యూనియన్ల నాయకులు రాము, ఎస్ హుస్సేన్ వలి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఏఐటియుసి నాయకులు సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్