తిరుమల లడ్డూ కల్తీపై తెదేపా నిరసన, ప్రత్యేక పూజలు

411చూసినవారు
వైకాపా పాలనలో హిందువుల మనోభావాలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ అయినట్లు రుజువైన నేపథ్యంలో, తెదేపా ఆధ్వర్యంలో గురువారం స్థానిక శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు లడ్డూ కల్తీకి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని విమర్శించారు.