కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

1737చూసినవారు
కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రి వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప్పలపాడుకు చెందిన వెంకటరమణ రెడ్డి (69) మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పిన వైద్యులు, అనంతరం ఆకస్మికంగా మరణించినట్లు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ, ఆసుపత్రి యాజమాన్యం నుంచి స్పష్టమైన వివరణ కోరుతూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్