కర్నూలు నగరంలో సీ. క్యాంప్ సెంటర్ వద్ద రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతి చెందారు. గతనెల 11న ఆసుపత్రిలో చేరిన ఈ వ్యక్తి మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 9121101061, 08518–277187 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ శేషయ్య విజ్ఞప్తి చేశారు.