నన్నూరు వద్ద విద్యుత్ షాక్‌తో మృతిచెందిన టీడీపీ కార్యకర్త అర్జున్ కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో పరామర్శించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి, కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటానని, జీవితాంతం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సంఘటనలో మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలబడతామని ఆయన భరోసా కల్పించారు.