ఆదోనిలో శుక్రవారం కొత్త బ్రిడ్జి సమీపంలో గూడ్స్ రైలు కింద పడి బోగనూరు నాజియా బాను (22) అనే యువతి మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసులు వివరాలు వెల్లడించారు. స్థానిక విక్టోరియా పేటకు చెందిన నాజియా బానుకు ఇష్టం లేని వివాహం చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.