
జాలవాడి: చిన్నారి ఆపరేషన్ కు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 2. 50 లక్షలు
మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి కృషితో, జాలవాడి గ్రామానికి చెందిన వైష్ణవి వెన్నెముక ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కింద గురువారం రూ. 2.50 లక్షలు మంజూరు అయ్యాయి. మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి ఈ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సహాయానికి కుటుంబం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపింది.






































