రైతులకు 100 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి

732చూసినవారు
రైతులకు 100 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి
కోసిగి మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో 100 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చినట్లు ఏవో ఎం. వరప్రసాద్ తెలిపారు. ఏపీ ఏఐఎంఎస్ ద్వారా రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పంట అవసరాలకు అనుగుణంగా రెండు లేదా మూడు దఫాల్లో యూరియా అందజేస్తామని, ఏపీ మార్క్‌ఫెడ్ గోదాముల్లో తగినంత నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రైతులు నూతన విధానంపై అవగాహన పెంచుకుని సిబ్బందికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్