చిన్నతుంబలం: స్టేట్‌ టాపర్ దీపికకు ‘షైనింగ్ స్టార్’ అవార్డు

919చూసినవారు
చిన్నతుంబలం: స్టేట్‌ టాపర్ దీపికకు ‘షైనింగ్ స్టార్’ అవార్డు
పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామానికి చెందిన ఎస్. దీపిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 988 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచింది. మంగళవారం, ఏపీఆర్‌జేసీ బాలికల కళాశాల, బనవాసిలో చదువుతున్న దీపికకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ‘షైనింగ్ స్టార్’ అవార్డుతో పాటు ల్యాప్‌టాప్‌ను అందజేశారు. ఉన్నత విద్యాభ్యాసానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దీపిక తల్లిదండ్రులు వీరేష్, సునీతమ్మ ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్