డి. బెలగల్: నీటి సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం

467చూసినవారు
డి. బెలగల్: నీటి సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం
కర్నూలు జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డా ఏ. సిరి 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. గురువారం కోసిగి మండలం డి. బెలగల్ గ్రామంలోని చెక్ డ్యామ్, నాగమ్మ చెరువును పరిశీలించి, చెరువులు నీటితో నిండేలా, వాగులు, వంకలలో అడ్డంకులు తొలగించేలా అధికారులను ఆదేశించారు. భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అన్ని మండలాల్లో అమలు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్