మంత్రాలయం నియోజకవర్గంలో రూ. 66.02 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజ జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు-మాలపల్లి బీటీ రోడ్, జలవాడి-కమ్మలదిన్నె సీసీ రోడ్, బైపాస్ చెట్నీపల్లి-కల్లూదేవకుంట రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ అభివృద్ధికి, మెరుగైన రవాణా సౌకర్యాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.