దివ్యాంగుడి నిజాయితీ: దొరికిన బంగారం, నగదు పోలీసులకు అప్పగింత

1516చూసినవారు
దివ్యాంగుడి నిజాయితీ: దొరికిన బంగారం, నగదు పోలీసులకు అప్పగింత
కర్నూలు జిల్లా, మంత్రాలయం సమీపంలోని పెద్దకడుబూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు కుదె మారెప్పకు మంగళవారం మార్గమధ్యంలో ఒక పర్సు దొరికింది. అందులో సుమారు రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.1,300 నగదు ఉన్నాయి. మారెప్ప వెంటనే ఆ పర్సును పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు విచారణ జరిపి, పర్సు యజమాని చాకలి మధుగా గుర్తించి, బంగారం, నగదును వారికి అప్పగించారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న మారెప్పను పోలీసులు సన్మానించి అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్