భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి ముందస్తు వేడుకలు

9చూసినవారు
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి ముందస్తు వేడుకలు
పెద్దకడబూరు రేయిన్‌బో ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి ముందస్తు వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ఆకట్టుకున్నారు. చిన్నారుల ఆటపాటలు, కృష్ణ నామస్మరణ, ఉట్టి కొట్టే కార్యక్రమాలతో పాఠశాలలో సందడి నెలకొంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై చిన్నారుల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.

సంబంధిత పోస్ట్