రైతు సంఘం రాష్ట్ర మహాసభలు: ఏలూరులో జూలై 3-5 తేదీల్లో చర్చలు

315చూసినవారు
రైతు సంఘం రాష్ట్ర మహాసభలు: ఏలూరులో జూలై 3-5 తేదీల్లో చర్చలు
కర్నూలు జిల్లా కౌతాళంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభల గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఉపాధ్యక్షులు కె. మల్లయ్య మాట్లాడుతూ, జూలై 3, 4, 5 తేదీలలో ఏలూరులో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు, కరువు, వలసలు, ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలు, సాగు-తాగునీటి అంశాలపై మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. ఈరన్నతో పాటు రైతు సంఘం నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్