ఏరువాకతో రైతులకు శాస్త్రీయ సాగుపై అవగాహన

1972చూసినవారు
ఏరువాకతో రైతులకు శాస్త్రీయ సాగుపై అవగాహన
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఏరువాక కార్యక్రమం జరిగింది. సంయుక్త కలెక్టర్ నూరుల్ కౌమార్, ఎమ్మెల్సీ బి.టి. నాయుడు, ఎమ్మెల్యే డా. పార్థసారథి పాల్గొని భూమాతకు పూజలు చేసి, నాగలితో పొలం దున్ని నవధాన్యాలు విత్తారు. ఎల్-నినోను ఎదుర్కొనే సాగు విధానాలపై పుస్తకావిష్కరణతో పాటు, రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రగతిశీల రైతులకు సన్మానం చేసి, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్