కర్నూలు జిల్లా ఆదోనిలో ఏప్రిల్ 7, 2026న మాధవరం వెళ్లే ప్రధాన రహదారిలో మారెమ్మ గుడి సమీపంలో ఉన్న ఆయిల్ నిల్వ గోడెన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పారేయడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో అగ్నిమాపక యంత్రం చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.