మాజీ సర్పంచ్ రామన్న ఆర్థిక సాయం అందజేత

1836చూసినవారు
మాజీ సర్పంచ్ రామన్న ఆర్థిక సాయం అందజేత
పెద్దకడబూరు మండలం జాలవాడికి చెందిన ఈరన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జాలవాడి మాజీ సర్పంచ్ రామన్న, మృతుడి కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తన వంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. టీడీపీ గ్రామ అధ్యక్షుడు వెంకన్న, అబ్బిలి లింగేష్, ఉల్లిగప్ప, చిన్న లక్ష్మన్న, భీమేష్, చిన్న భీమేష్, పెద్ద భీమేష్ కూడా ఈరన్న కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్