ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమొరియల్ హాల్ నందు ఆదివారం, రావూస్ డిగ్రీ కళాశాల ఫౌండర్ కీ.శే. బూదూరు వీరారెడ్డి జ్ఞాపకార్థం రోటరీ క్లబ్, విన్నర్ వీల్ క్లబ్, రావూస్ డిగ్రీ కళాశాల యాజమాన్యం బూదూరు తిరుమల రెడ్డి, బూదూరు సుజనా రెడ్డిల భాగస్వామ్యంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, సీబీపీ, ఆర్బీఎస్, ఎఫ్ఎన్ఏసీ, పీఏపీ ఎస్ఎంఈఏఆర్ (వివాహమైన మహిళలకు మాత్రమే)
పరీక్షలు, గుండె
పరీక్షలు నిర్వహించారు. అలాగే, రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు.