బాలబంధు గద్వాల సోమన్న 99వ పుస్తకం 'ప్రసన్న వదనం' ఆవిష్కరణ

1425చూసినవారు
బాలబంధు గద్వాల సోమన్న 99వ పుస్తకం 'ప్రసన్న వదనం' ఆవిష్కరణ
నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామ జెడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన 99వ పుస్తకం 'ప్రసన్న వదనం' కర్నూలులో ఆదివారం ఘనంగా ఆవిష్కరించబడింది. ముఖ్య అతిథులు కళారత్న చంద్రశేఖర్ కల్కూర, జె.యస్ఆర్.కె. శర్మ, కవి ఎలమర్తి రమణయ్య చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది. అనంతరం బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకురాలు డా.దండెబోయిన పార్వతి, వ్యాఖ్యాత ఆకాశవాణి కండె సునీత, కవులు ఆరెకటిక నాగేశ్వరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్