గురుకులాల్లో సీట్ల పెంపునకు ఐహెచ్‌ఆర్‌ఎఫ్ వినతి

469చూసినవారు
గురుకులాల్లో సీట్ల పెంపునకు ఐహెచ్‌ఆర్‌ఎఫ్ వినతి
రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం సీట్ల సంఖ్యను పెంచాలని ఐహెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర డైరెక్టర్ టి. అంజినయ్య ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. పెరుగుతున్న డిమాండ్ కారణంగా అర్హులైన పేద విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారని, 2026-27 విద్యా సంవత్సరం నుంచే అదనపు సెక్షన్లు మంజూరు చేసి సీట్ల సామర్థ్యాన్ని 10-20 శాతం పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐహెచ్‌ఆర్‌ఎఫ్ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్