కరువు మండలాల్లో పెద్దకడబూరుకు మొండిచెయ్యి

8చూసినవారు
కరువు మండలాల్లో పెద్దకడబూరుకు మొండిచెయ్యి
కరువు మండలాల జాబితాలో పెద్దకడబూరు మండలానికి ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. వర్షాభావ పరిస్థితుల మూలంగా రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండి పోయాయి. అలాగే ఎల్లెల్సీ కాలువ పెద్దకడబూరు ఒడిలోనే ఉన్నప్పటికీ వరి పంట సాగు చేయొద్దని అధికారులు ఆదేశించడంతో రైతులు వరి సాగుకు దూరమయ్యారు. ఈ ఏడాది పత్తి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పత్తి పంటను పరిశీలించి వెల్లడించారు. ప్రభుత్వం మరోసారి పరిశీలించి పెద్దకడబూరును కరువు మండలంగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్