కల్లుదేవకుంట: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి

2320చూసినవారు
కల్లుదేవకుంట: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి
మంగళవారం ఎమ్మిగనూరు–మంత్రాలయం జాతీయ రహదారిపై కల్లుదేవకుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక జింక మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి, ఖననం చేస్తామని ఎఫ్‌బీఓ నాగేష్ తెలిపారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్