కౌతాళం మండల కేంద్రంలో విజయలక్ష్మి అధ్యక్షతన సీఐటీయూ జనరల్ బాడీ సమావేశం జరిగింది. జిల్లా నాయకులు బి. రామాంజనేయులు, కే. మల్లయ్యలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక హక్కులను కుదించిందని, పేదలకు ఉపయోగకరమైన ఉపాధి చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. ఫిబ్రవరి 12న జరిగే ర్యాలీ, సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, రైతులు, కూలీలు, ఆటో కార్మికులు భారీగా హాజరయ్యారు.