కౌతాళం: ఘనంగా త్రయంబకేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం

956చూసినవారు
కౌతాళం: ఘనంగా త్రయంబకేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం
కౌతాళంలో వెలసిన పార్వతి దేవి సమేత త్రయంబకేశ్వర స్వామి దేవస్థానం మూడవ వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చెన్న బసప్ప, ఆయన సోదరుడు కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. వీరశైవ లింగాయత్ సంఘం కోరిక మేరకు వరుసగా మూడవసారి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందిన అనంతరం శివయోగి శివచార్య మహాస్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు. సంఘ సభ్యులు వారిని శాలువా, పూలమాలతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్