కోసిగి: సీఎంపై అంబటి అనుచిత వ్యాఖ్యలపై దిష్టిబొమ్మ దహనం

348చూసినవారు
కోసిగి: సీఎంపై అంబటి అనుచిత వ్యాఖ్యలపై దిష్టిబొమ్మ దహనం
కోసిగి టౌన్‌లో వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబటి వైఖరిని ప్రజలు సహించరని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు తగవని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్