కోసిగి: 2029లో జగన్ సీఎం కావడం ఖాయం: బాలనాగిరెడ్డి

346చూసినవారు
కోసిగి: 2029లో జగన్ సీఎం కావడం ఖాయం: బాలనాగిరెడ్డి
శుక్రవారం కోసిగిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత వై. ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాడిగేని ఏరియా నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ప్రజలు తిరిగి వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని, 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్