కర్నూలు: అనుమతులు లేని లేఅవుట్లపై చర్యలు తప్పవు: సోమిశెట్టి

1596చూసినవారు
మంత్రాలయం నియోజకవర్గంలో అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసిన, అనుమతి పొందని వెంచర్లను అభివృద్ధి చేస్తున్న వారిపై కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, బఫర్ జోన్‌లలో వెంచర్లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని, భూ యజమానులు, వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమతులు లేని లేఅవుట్లు, బఫర్ వెంచర్లపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు చేపడతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్