కర్నూలు: ఐసీడీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

375చూసినవారు
కర్నూలు: ఐసీడీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా మహిళా, శిశు అభివృద్ధి అధికారి పి. విజయ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు శిశు గృహంలో ఈడబ్ల్యూఎస్-1, ఎస్సీ త్రీ-1, పెద్దపాడు బాలసదనంలో హౌస్ కీపర్-1, పత్తికొండ బాల సదనంలో ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంది. అర్హులైన వారు ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు కలెక్టరేట్లో దరఖాస్తులు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్