కర్నూలు: భూగర్భ జలాల పెంపుదలపై ప్రత్యేక చర్యలు అవసరం

496చూసినవారు
కర్నూలు: భూగర్భ జలాల పెంపుదలపై ప్రత్యేక చర్యలు అవసరం
కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, గురువారం కోసిగి మండలం డి. బెలగల్ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో "జలధార–జల హారతి" కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ స్థాయి నీటి ప్రణాళికలపై సమీక్ష సమావేశంలో, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి భద్రతను బలోపేతం చేయడం అత్యవసరమని, తక్కువ వర్షపాతం నేపథ్యంలో అధిక నీటిని వినియోగించే వరి పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్