మాజీ సీఎం జగన్ ఆడించే ఆటలో అంబటి రాంబాబు, జోగి రమేష్‌లు పావులని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు కులాలను ఎందుకు అంటగడతారని మండిపడ్డారు. జోగి పిచ్చోడని, ఆయన మాటలు పిచ్చివని అన్నారు. జగన్ అధికారులను కేసుల్లో ఇరికించి, కల్తీ నెయ్యి, ఇసుక, ల్యాండ్, మైన్‌ల కేసుల ద్వారా ప్రజల సొమ్ము దోచుకున్నారని, ఆయన దుర్మార్గుడని, ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు.