కర్నూలు జిల్లా
టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్‌ఐఆర్) సర్వేపై సమన్వయ సమావేశం జరిగింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రాలయం
టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ, ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన ప్రతి ఓటరు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.