విద్యార్థుల అభ్యాసానికి తోడ్పాటుగా స్పీకర్ బహూకరణ

304చూసినవారు
విద్యార్థుల అభ్యాసానికి తోడ్పాటుగా స్పీకర్ బహూకరణ
కౌతాళం మండలం బదినేహాల్ గ్రామ ప్రాథమిక పాఠశాల (తెలుగు మాధ్యమం) అభివృద్ధికి గ్రామస్థుడు బి. లక్ష్మీరెడ్డి రూ. 10,000 విలువైన స్పీకర్‌ను సోమవారం బహూకరించారు. విద్యార్థుల అభ్యాసానికి ఉపయోగపడేలా ఈ స్పీకర్‌ను అందించడంతో పాటు, తరగతి గది పైకప్పు మరమ్మతులు కూడా చేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విద్య పట్ల ఆయన చూపుతున్న సేవాభావం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.