మంత్రాలయం: చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదు: ఎమ్మెల్యే

1382చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. శనివారం రాంపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కంటే నాలుగు గ్రామ పంచాయతీల అంశానికే ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమన్నారు. అవసరమైతే స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి ప్రజా తీర్పును స్వీకరిస్తామని చెప్పారు. బీసీల ప్రభుత్వమని చెప్పుకుంటూ వాల్మీకి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్