తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టంగా తేల్చిందని, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు చేశారని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి శనివారం తెలిపారు. కోట్లాది భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు చేయడం తగదని, నిజాలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. సీబీఐ నివేదికతో చంద్రబాబు కుట్రలు బట్టబయలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.