సోమవారం, మంత్రాలయంలోని తుంగభద్ర నది తీరంలో హోటల్ యజమాని జంగం రంగస్వామికి చెందిన గోదాం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. హోటల్ సామగ్రి, ఫ్రిజ్, గ్రైండర్, వంట సామాగ్రి, కిరాణా సరుకులు నిల్వ చేసిన గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, నిత్యావసర సరుకులు కాలిపోవడంతో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.