ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: అవ్వాతాతలకు చంద్రబాబు భరోసా

1937చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: అవ్వాతాతలకు చంద్రబాబు భరోసా
పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందజేస్తున్నారని, ఇది అవ్వాతాతలకు వరంలాంటిదని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు భరోసా లభిస్తోందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్