మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం గ్రామపంచాయతీ పరిధిలోని బండిమెట్ట, కమేళా, దినసరి మార్కెట్‌కు సంబంధించిన గురువారం జరగాల్సిన వేలం పాటలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. బుధవారం సర్పంచ్, అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆదోని డివిజన్ పంచాయతీ అధికారి, డిప్యూటీ ఎంపీడీఓ ఆధ్వర్యంలో, పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్ రెడ్డి సమక్షంలో ఈ వేలం పాటలు జరగాల్సి ఉంది. వేలం పాటల కొత్త తేదీని త్వరలో తెలియజేస్తామని అధికారులు తెలిపారు.