పెద్దకడబూరు టౌన్‌లోని 206వ బూత్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ఓటరు వెరిఫికేషన్ నిర్వహించారు. ఆదివారం
టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు ఓటరు నమోదు, సవరణలు, మార్పులపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన వారు ఫాం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని, వివాహిత మహిళలు ఫాం-8 ద్వారా పోలింగ్ కేంద్రం మార్పు చేసుకోవాలని, మరణించిన వారి పేర్లను ఫాం-7 ద్వారా తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ హనుమంతు, కో-కన్వీనర్ గుమ్మల ప్రసాద్, బీఎల్‌వో, వీఆర్వో నరసన్న,
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.