పెద్దకడబూరు: ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు

18చూసినవారు
పెద్దకడబూరు: ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు - 2 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి మొట్రు రామాంజనేయులు స్థానిక ఆదిఆంధ పాఠశాలలో తన ఓటుహక్కును గురువారం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండున్నర ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తన విజయానికి శ్రీరామ రక్ష అని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ - 2 పరిధిలోని ఓటర్లు తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్