పేకాట స్థావరంపై పోలీసుల దాడి... ఆరుగురు అరెస్ట్

4చూసినవారు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి... ఆరుగురు అరెస్ట్
పెద్దకడబూరు మండలంలోని దొడ్డిమేకల గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై మారుతి సిబ్బందితో కలిసి మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పెద్దకడబూరుకు చెందిన వడ్డే నగేష్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ. 8, 150 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్